Site icon Prime9

Road Trips: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన రోడ్ ట్రిప్స్ ఇవే..

road trips

road trips

Road Trips: మనలో  చాలా మందికి  ట్రావెలింగ్ చేయడమంటే  ఇష్టముంటుంది. మనం చేసే ప్రతి యొక్క  ప్రయాణం  మనకి  సరికొత్త అనుభూతినిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే  రోడ్ ట్రిప్స్   ప్లాన్ చేసుకొని  టూర్‌  వెళ్తుంటే ఆ కిక్కే వేరు. వెళ్ళే దారిలో  మనకి తెలియకుండా  ప్రశాంతత,  స్వేచ్ఛ  దొరుకుతుంది.  మనం  ప్రయాణం చేసేటప్పుడు  ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి.  వరుసగా  10 రోజులు సెలవులు వస్తే చాలు ఏదో ఒక ప్లేస్ కు వెళ్ళి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది.  ఈ  సెలవుల్లో  టూర్ ప్లాన్ చేసేవారు ప్రపంచంలోని కొన్ని అందమైన ప్లేసులకు  వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు.  మన  జీవితంలో ఒక్కసారైనా రోడ్ ట్రిప్‌ ద్వారా చూడాల్సిన  డెస్టినేషన్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో రెండింటి  గురించి  ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కూర్గ్..

గోవా-గోకర్ణ-మురుడేశ్వర్-భత్కల్-ఉడిపి-మంగళూరు-మడికేరి మార్గాల ద్వారా కొడగు( కూర్గ్) చేరుకోవచ్చు 501 కి.మీ సాగే ఈ ప్రయాణం ఎంతో సుందరమైన అనుభూతినిస్తుంది.

భారతదేశంలోని పశ్చిమ కనుమల నుంచి సాగే ఈ ప్రయాణం అరేబియా సముద్రపు సుందరమైన ప్రదేశాలతో చూపరులను ప్రయాణికులను కట్టిపడేస్తుంది. ఎన్నోరోడ్‌సైడ్ స్టాల్స్‌ ఉంటాయి. ఆహార ప్రియులకు ఇది మంచి ప్రయాణమే. గోకర్ణ వద్ద అద్భుతమైన దృశ్యాలు, మురుడేశ్వర్‌లోని మురుడేశ్వర స్వామి ఆలయ అందాలు, మడికేరిలోని సుందరమైన అబ్బే జలపాతం, కూర్గ్ జిల్లాలోని ఆహ్లాదకరమైన కాఫీ తోటలు ఆధ్యంతం పర్యాటకులను అలరిస్తాయి. ప్రకృతి ప్రేమికులు ఫుల్ ప్యాక్డ్ యాత్రగా దీనిని చెప్పవచ్చు. ఈ జర్నీకి వెళ్లేందుకు వర్షాకాలం ఉత్తమమైన సమయం.

న్యూజిలాండ్..

ఈ దేశం చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు  మాత్రం చాలా  బావుంటాయని  అందరూ  అంటుంటారు. ట్రావెలర్స్, టూరిస్టులకు ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం చాలా బాగా నచ్చుతుందని ఇక్కడకి వచ్చిన వారు తెలిపారు. న్యూజిలాండ్ రోడ్ ట్రిప్‌లో అక్కడ రోడ్లన్ని  చాలా శుభ్రంగా ఉంటాయని  నీట్‌గా ఉండే రోడ్లు, నిశ్శబ్దమైన ప్రదేశాలు, ప్రకృతి అందాలను  చూసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు.  ముఖ్యంగా నార్త్ లేదా సౌత్ ఐస్‌ల్యాండ్ వెళ్తే అక్కడ అందమైన  లొకేషన్స్ ను  చూడవచ్చు.

ఇదీ చదవండి: అదో డెత్ వ్యాలీ.. అక్కడి రాళ్లు కదులుతాయి.. పరుగెతాయి కూడా..!

 

Exit mobile version