Site icon Prime9

Andhra Ooty Araku Valley: ఆంధ్రా ఊటీ అరకులో చూడవలసిన ప్రదేశాలు ఇవే

Andhra Ooty Araku Valley: ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే పర్యాటకులు అరకు చూడకుండా వెళ్లరు. ఆంధ్రా ఊటీగా పిలుచుకునే అరకు, విశాఖపట్నానికి సుమారు 115 కీ.మీ దూరాన, ఆంధ్రా – ఒడిశా సరిహద్దు కు సమీప ప్రాంతములో వుంది. అరకు ప్రాంతము చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు,లోతైన లోయలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలు మరియు ప్రకృతి ప్రసాదించిన ఎన్నెన్నో అందాలతో చూడదగ్గ పర్యాటక ప్రదేశం.

అరకు చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రదేశాలు..

ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం,
శ్రీ వేంకటేశ్వరాలయం, పద్మాపురం గార్డెన్స్
రణజిల్లెడ వాటర్ ఫాల్స్, చాపరాయి జలపాతం
మత్స్యగుండం, అనంత గిరి మౌంటెన్
బొర్రా గుహలు, కవిటి వాటర్ ఫాల్స్
అనంతగిరి వాటర్ ఫాల్స్, తాడిగుడ వాటర్ ఫాల్స్
టైడా జంగిల్ బెల్స్ మొదలైనవి తప్పకుండా చూడాలి.

అరకు బస్ స్టాండ్ కు సమీపంలో ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, శ్రీ వేంకటేశ్వర ఆలయం ఉంటాయి. అరకు లోయ – అరకు రైల్వే స్టేషన్ రోడ్డు కు సుమారు మూడు కీ.మీ లోపలకి పద్మాపురం ఉద్యాన వనం ఉంది. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితరాలు ఉన్నాయి. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్‌ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తాయి అరకు లోయకు ఉత్తరం దిశగా. సుమారు ఏడు కీ.మీ దూరాన రణజిల్లెడ వాటర్ ఫాల్స్ కలవు. అరకు – పాడేరు రోడ్డు మార్గంలో చాపరాయి జలపాతం ఉంది. అరకు గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో గల చాపరాయి జలపాతం చూడగలం. బండరాయి వంటి చాపరాతి మీదగా నీటి ప్రవాహం జాలువారుతుంది. ఇక్కడ బొంగు చికెన్ ఫేమస్. విశాఖపట్నం నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా అరకు చేరుకోవచ్చు. ఇక్కడ పర్యాటకులు బసచేయడానికి పలు లాడ్జిలు వున్నాయి.

Exit mobile version