Site icon Prime9

Gold And Silver Prices: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Today Gold And Silver Price in india on september 7 2023

Today Gold And Silver Price in india on september 7 2023

Gold And Silver Prices: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. దిగివచ్చిన పసిడి ధరలు. ఒక్కరోజుకే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడం గోల్డ్ ప్రియులకు చాలా ఊరటను కలిగిస్తుందనే చెప్పాలి. అసలే భారతీయలకు బంగారం అంటే అమితమైన ఇష్టం ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. తమకంటూ ఎంతో కొంత బంగారం ఉండాలని ఆశిస్తుంటారు. అందుకే పెళ్లిళ్లలోనే కాకుండా ఇతర ఏ ఏ శుభకార్యాలైనా, సందర్భాల్లోనూ బంగారం కొంటుంటారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్ మహా నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.700 తగ్గి రూ.55 వేల 300గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 తగ్గి రూ.60 వేల 330గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం(10 గ్రాములు) బంగారం ధర రూ.55 వేల 450గా ఉండగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.60 వేల 480 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు(Gold And Silver Prices)..

వెండి ధరలు సైతం ఇవాళ భారీగా పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.800 తగ్గి రూ.77 వేల 800 పలుకుతోంది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.400 దిగివచ్చి ప్రస్తుతం రూ. 73 వేలు వద్ద ట్రేడవుతోంది.

Exit mobile version
Skip to toolbar