Today Gold And Silver Price : ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బులియన్ మార్కెట్ లో బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు శుక్రవారం కూడా పైపైకి పోతున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగి రూ. 56,800కి చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 160 పెరిగి, తులం బంగారం రూ 61,960కి చేరింది. వెండి కూడా బంగారం దారిలోనే ప్రయణిస్తోంది. దేశ వ్యాప్తంగా వెండి ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఒకేరోజు ఏకంగా రూ. 500 పెరగడం గమనార్హం.
ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
చెన్నైలో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,00గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,200గా ఉంది.
ముంబై లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,110 గా ఉంది.
ఇక కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
పూణెలో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,960 వద్ద కొనసాగుతోంది.
నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,800గ కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,960గా ఉంది.
ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,960గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
చెన్నైలో ఈ రోజు కిలో వెండి ధర రూ. 78,000కి చేరింది.
ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి రూ. 75,100గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో శుక్రవారం కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.