Today Gold And Silver Price : అక్టోబర్ 26న బంగారం, వెండి ధరలు.. ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు !

ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిస్థితుల రీత్యా బులియన్ మార్కెట్ లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 26, 2023) బంగారం ధర పెరగగా, వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ మేరకు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా

  • Written By:
  • Updated On - October 26, 2023 / 01:06 PM IST

Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిస్థితుల రీత్యా బులియన్ మార్కెట్ లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 26, 2023) బంగారం ధర పెరగగా, వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ మేరకు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.

ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది.

ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది.

ఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.