Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 9, 2023 ) బంగారం, వెండి ధరలు.. తగ్గిన పసిడి

అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల రీత్యా బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండడం గమణించవచ్చు. పలుమార్లు ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. కాగా గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఈరోజు ( నవంబర్ 9, 2023 ) కూడా తగ్గుముఖం పట్టాయి.

  • Written By:
  • Publish Date - November 9, 2023 / 10:49 AM IST

Today Gold And Silver Price : అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల రీత్యా బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండడం గమణించవచ్చు. పలుమార్లు ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. కాగా గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఈరోజు ( నవంబర్ 9, 2023 ) కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 160 మేర ధర తగ్గింది. ఇక నేటి ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 లుగా ఉంది. అదే విధంగా కిలో వెండి ధర రూ.1000 మేర తగ్గి 73,500 లుగా కొనసాగుతోంది.

ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,350 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,100, 24 క్యారెట్ల ధర రూ.61,200

కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,100, 24 క్యారెట్లు రూ.61,200

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,600, 24 క్యారెట్ల ధర రూ.61,750

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100, 24 క్యారెట్ల ధర రూ.61,200

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,100, 24 క్యారెట్ల ధర రూ.61,200 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,200 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,100, 24 క్యారెట్ల ధర రూ.61,200 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది.

ముంబైలో రూ.73,500

చెన్నైలో రూ.76,500

బెంగళూరులో రూ.73,000

కేరళలో రూ.76,500

కోల్‌కతాలో రూ.73,500 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,500

విజయవాడలో రూ.76,500

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,500 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.