Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 24, 2023 ) బంగారం, వెండి ధరలు..

గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తులం బంగారం పై రూ. 50 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 56,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది.

  • Written By:
  • Publish Date - November 24, 2023 / 11:43 AM IST

Today Gold And Silver Price : గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తులం బంగారం పై రూ. 50 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 56,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 200 వరకు పెరుగుదల కనిపించింది.

ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,120 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,350గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,550గా ఉంది.

కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,970గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ..

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో శుక్రవారం కిలో వెండి ధర రూ. 76,200గా ఉంది.

ఇక చెన్నైలో అత్యధికంగా రూ. 79,200 వద్ద కొనసాగుతోంది.

కేరళలో కిలో వెండి ధర రూ. 79,200.

అలాగే బెంగళూరులో రూ. 75,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,200 వద్ద కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.