Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 1, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం (నవంబర్‌ 1, 2023 ) బంగారం, వెండి  ధరలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలోనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 తగ్గగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 550 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్‌

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 11:11 AM IST

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం (నవంబర్‌ 1, 2023 ) బంగారం, వెండి  ధరలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలోనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 తగ్గగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 550 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 56,700 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే కిలోపై సుమారు రూ. 300 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 75,300కి చేరింది.

ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,000 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,700కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,850వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,350గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 56,700కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850గా ఉంది. కేరళలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850వద్ద కొనసాగుతోంది.

ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 పలుకుతోంది.

ఖమ్మం, గుంటూరు, నిజామాబాద్‌ ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇదే ధరలకు బంగారం లభిస్తోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి రూ. 78,200

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 75,300 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.