Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో నిన్న ఒక్కసారిగా 400 పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి. ఇక ఇదే క్రమంలో నేడు మాత్రం పసిడి కొనుగోలు చేయాలని అనుకునే వారికి కొంత ఊరట లభించింది. ఈరోజు ( జూన్ 18, 2023 ) బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలలో పెద్దగా మార్పులు కనిపించలేదు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా ..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ₹ 55,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,490 కి చేరింది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 కి చేరింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,260 గా నమోదైంది.
కోల్‌కతా 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,160 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,110.
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 55,100, 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్స్ రూ. 55,100, 24 క్యారెట్స్ ధర రూ. 60,110గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో రూ. 73,100
చెన్నైలో రూ. 78,500
బెంగళూరులో 73,000 వద్ద కొనసాగుతోంది.
ఇక హైదరాబాద్‌లో రూ. 78,500
విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 78,500వద్ద కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.