Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ నిత్యం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. అయితే గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గడం లేదా స్థిరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ( జూన్ 13, 2023 ) బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో తులంపై రూ. 100 వరకు తగ్గుముఖం పట్టింది. మరి ఈ మేరకు నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,600 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,450గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,900 వద్ద కొనసాగుతోంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,450గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,500 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,450 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,450గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,450 లుగా పలుకుతోంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,300 లుగా ఉంది.
ముంబై, కోల్కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది.
ఇక చెన్నై, కేరళలో రూ. 79,300 ట్రెండ్ అవుతోంది.
ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,300 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.