Today Gold And Silver Price: మహిళలకు షాపింగ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బట్టలు, నగలు. అందులోనూ వారు అత్యంతగా ఇష్టపడేది పసిడి. ఇక బంగారం రేటు విషయానికి వస్తే రోజులు గడుస్తున్నకొద్దీ రేట్లలో తేడా వస్తుంది తప్ప తగ్గడం తక్కువగానే ఉందని చెప్పాలి. మరి ఈ రోజు పసిడి ధర స్థిరంగా ఉందనే చెప్పాలి. పసిడి, వెండి రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలోని పసిడి ధరలు మారుతుంటాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ ఆభరణాల మార్కెట్లలో వినియోగదారుల డిమాండ్‌లోని హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు గోల్డ్ సిల్వర్ రేట్లను ప్రభావితం చేస్తాయి. బంగారం రేటులో నేడు ఎటువంటి తేడా లేదు కానీ కిలో వెండి రేటు మాత్రం రూ. 1500 పెరిగింది.
ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు(Today Gold And Silver Price)
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 55 వేల 4 వందల 50 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల పసిడి రేటు 60 వేల రూపాయల వరకు పలుకుతోంది.
ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55 వేలు ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60 వేలుగా ఉంది.
ఇక తెలుసురాష్ట్రాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌లో అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55 వేల రూపాయల వరకు ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60 వేలు ఉంది. విజయవాడలో అయితే వరుసగా 22 క్యారెట్ల పుత్తడి ధర 55 వేల రూపాయలు కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60 వేల వరకు ఉంది. ఇక బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి మాత్రం భారీగానే ఎగబాకింది. కిలో సిల్వర్‌పై 1500 వరకు పెరిగి ప్రస్తుతం రూ. 77,100 వరకు ఉంది.