Today Gold And Silver Price: సాధారణంగా భారతీయ మహిళలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి.. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్, ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొంటుంటారు. దీనితో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ పెరుగుతుంటుంది. అయితే, గత కొంతకాలం నుంచి గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 జూన్ 2023 గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.54,700గా ఉంది. 24 క్యారెట్స్ తులం గోల్డ్ ధర రూ.330 తగ్గి రూ.59,670 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గి 73,000లుగా ఉంది.
గోల్డ్ ధరలు..
ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.850, 24 క్యారెట్స్ రూ.59,820గా ఉంది
ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,700, 24 క్యారెట్స్ రూ.59,670గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్స్ రూ.54,700, 24 క్యారెట్స్ రూ.59,670 గా ఉంది.
ఇక హైదరాబాద్లో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 54,700 కాగా 24 క్యారెట్స్ రూ.59,670గా ఉంది.
విశాఖపట్నంలో తులం గోల్డ్ ధర రూ 54,700 కాగా 24 క్యారెట్స్ పసిడి ధర రూ.59,670, విజయవాడలో 54,700, 24 క్యారెట్స్ రూ.59,670 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో రూ.73.000, ముంబైలో కిలో వెండి ధర రూ.73.000, బెంగళూరులో రూ.72.000, హైదరాబాద్ లో రూ.76,500, విశాఖపట్నంలో రూ.76.500, విజయవాడలో రూ.76,500లుగా ఉంది.