Today Gold And Silver Price: బంగారం అంటే ఇష్టపడని ఆడవారంటూ ఉండరు. ఆభరణాలతో అలంకరణ అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగంగా మారింది. అందుకే చాలా మంది తమ వద్ద ఎంతో కొంత బంగారం ఉండాలి భావిస్తుంటారు. ప్రస్తుతం అంతర్జాతీ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న తరుణంలో చాలా మంది బంగారాన్ని ఒక పెట్టుబడిగా భావిస్తూ పెద్ద మొత్తంలో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలో గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతూ తగ్గతూ ఉంటున్నాయి. ఇదిలా ఉంటే మనదేశంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంది. అది ఎలాంటి సమయైనా గోల్డ్ విలువ అనేది ఎప్పుడూ ఖరీదైనదిగానే పరిగణిస్తుంటారు. ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న క్రమంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని పుత్తడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,750 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,860 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర సుమారు రూ.80,000 లుగా కొనసాగుతోంది.
అమెరికా డాలర్‌తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో భారత కరెన్సీ రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.888 మార్క్ వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.55,790 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం 60,860 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.55, 940 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.61, 010 వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే ధరలు రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.80,200 మార్క్ వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.76 వేల 600 వద్ద అమ్ముడవుతోంది.