Telangana Inter Supply Results Out: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్, ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా వీరికి మే 22 నుంచి మే 29 వరకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇవాళ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చు. అలాగే పరీక్షలకు సంబంధించిన మెమోలను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్లు ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.