Prime9

Ethiopian Airlines: హైదరాబాద్‌ నుంచి ఆఫ్రికాకు మొదటిసారి విమాన సర్వీసు ప్రారంభం!

Shamshabad to Addis Ababa Direct Flight: హైదరాబాద్‌ నుంచి ఆఫ్రికాకు నేరుగా మొదటిసారి విమాన సర్వీసు ప్రారంభమైంది. శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం నుంచి ఇథియోపియా రాజధాని అడ్డిస్‌ అబాబాకు నాన్‌-స్టాప్‌ సేవలను ప్రారంభించారు. దీంతో హైదరాబాద్‌ గ్లోబల్‌ కనెక్టివిటీ మరింత బలపడింది. సేవలను ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ నిర్వహిస్తోంది. అడ్డిస్‌ అబాబా నుంచి హైదరాబాద్‌కు సోమ, బుధ, శుక్రవారాల్లో సర్వీసులు పడపనున్నారు. హైదరాబాద్‌ నుంచి అడ్డిస్‌ అబాబాకు మంగళ, గురు, శనివారాల్లో నడపనున్నారు.

 

పర్యాటక ప్రయాణికులకు మరింత అనుకూలత..

విమాన సర్వీసుతో అడ్డిస్‌ ఇథియోపియాతో భారత వ్యాపార, పర్యాటక ప్రయాణికులకు మరింత అనుకూలత లభించనుంది. మరోవైపు ఇండియాలో వైద్యం చేయించుకునేందుకు ఆఫ్రికాలోని ఇథియోపియా, నైజీరియా, టాంజానియా, ఉగాండా, రువాండా, జాంబియా, కేమరూన్‌, కెన్యా దేశాల నుంచి అనేక మంది రోగులు వస్తుంటారు. అలాంటి రోగులకు విమాన సర్వీసు ఉపయుక్తంగా ఉండనుంది.

 

Exit mobile version
Skip to toolbar