Mahesh Goud: డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూ పార్టీలో, ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తుందన్నారు ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించినట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం గర్వకారణమన్నారు. మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగణన జరిగిందని.. కులగణన చేయగలిగిన దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయన్నారు. కష్టపడిన వారికి పదవులు వచ్చినప్పుడే తన స్థానానికి విలువ ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.