Prime9

Harish Rao on Banakacherla: జలదోపిడీకి కుట్రలు జరుగుతున్నాయి: హరీష్ రావు

Harish Rao Presentation on Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఏపీ జలదోపిడీకి కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన హరీష్ రావు.. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం మాట సాయం, మూట సాయం చేయలేదన్నారు. కానీ ఏపీకి మాత్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని.. ఇప్పుడు బనకచర్లకు నిధులు ఇచ్చి సాయం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ మీద శ్రద్ద లేదని.. ఎంతసేపు ప్రతిపక్షాలను ఎలా ఇరిటేట్ చేయాలనే ఆలోచిస్తోందన్నారు. అక్రమల కేసులు పెట్టడం, అర్థరాత్రి కేసులు, రైతుల అరెస్ట్ తప్ప సాగు నీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ధ్యాస ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు హరీష్ రావు.

 

 

Exit mobile version
Skip to toolbar