Prime9

Electric shock: కోరుట్లలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి!

Electric shock: జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద 9 మందికి విద్యుత్ షాక్ కొట్టింది. ఎనిమిది మందికి కరెంట్ షాక్ కొట్టగా.. కట్టెతో కాపాడే ప్రయత్నం చేసే మరొకతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. చికిత్స పొందుతూ వినోద్ , సాయి అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. భారీ వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విగ్రహనికి 33కేవీ విద్యుత్ తీగలు తగిలడంతో ప్రమాదం జరిగింది.

 

విద్యుత్ ప్రమాద ఘటనలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకుని.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించినట్లు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జివ్వాడి నర్సింగరావు తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar