CM Revanth Reddy Compassionate Appointment: గత 19 ఏళ్ళుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. వరంగల్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్ సింగ్ 1996లో సర్వీస్‌లో ఉండగానే ఎన్‌కౌంటర్‌లో మరణించారు. తండ్రి మరణం నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు బి. రాజ శ్రీ దరఖాస్తు చేసుకున్నారు.
వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తు గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. సమస్య గురించి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకి రాజ శ్రీ చెప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి నిబంధనలు సడలించైనా సరే ఉద్యోగం ఇవ్వాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.