Car Accident in Paradise Flyover: సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ పైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న మరొక కారు డివైడర్‌ను ఢీకొని మరో కారును ఢీకొట్టింది. కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఫ్లైఓవర్ పైకి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు చక్రాలు ఊడిపోయాయి. వెనకే వచ్చిన స్విఫ్ట్ కారు ఇన్నోవా కారును ఢీకొట్టడంతో ఫ్లై ఓవర్‌పైకి వెళ్లే మార్గం మూసుకుపోయింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్ పైకి వెళ్లేందుకు దారి లేక భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రెండు కార్లను అక్కడి నుంచి తొలగించారు.