Prime9

Telangana cabinet: మంత్రి పదవి కావాలన్న ఎమ్మెల్సీ విజయశాంతి

Telangana cabinet: మీనాక్షీ నటరాజన్‌తో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. కేబినెట్‌లో అవకాశం కల్పించాలని అద్దంకి దయాకర్ కోరారని తెలుస్తోంది. 15 నిమిషాలపాటు విజయశాంతి భేటీ అయ్యారు. బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరినట్టు సమాచారం. అందుబాటులో ఉన్న ఎంపీలతో మీనాక్షీ నటరాజన్‌ సమావేశమయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

 

 

ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థులను ఆదేశించారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిన నేతలతో మీనాక్షీ నటరాజన్‌ భేటీ అయ్యారు. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ ఈ సమావేశానికి హాజరయ్యారు. జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. ఈ విషయాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. క్యాబినెట్ లో ఇప్పటికీ 12మంది ఉన్నారు. దీంతో మరో ఆరుగురికి అవకాశం ఉంది.

 

 

Exit mobile version
Skip to toolbar