YouTube: ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ అండ్ సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్.. యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్ల కోసం మల్లీ లాంగ్వేజ్ పేరుతో సరికొత్త ఫీచర్ ను ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు.. తమకు నచ్చిన భాషలో ఇతర భాషల వీడియోలను చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
యూట్యూబ్ వేరే భాషలో ఉన్న కొన్ని వీడియోలు అందరీ అర్థం కావు. అలాంటి వాటిని అర్థం చేసుకునేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఈ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు యూట్యూబ్ తెలిపింది.
నచ్చిన లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకునేలా(YouTube)
మల్లీ లాంగ్వేజ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు, సెట్టింగ్స్ లోకి వెళితే ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
అందులో నచ్చిన లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకుంటే .. ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది. అయితే వీడియోకు మెయిన్ ఏ భాషలో ఆడియో ఉండాలనేది కంటెంట్ క్రియేటర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
డెస్క్ టాప్, టీవీ, యూట్యూబ్, మొబైల్ వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ పనిచేయనుంది.
ప్రస్తుతం సెలెక్ట్ చేసిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
త్వరలో యూజర్లు అందరికీ పరిచయం చేయనున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని భాషల్లో ఈ ఫీచర్ వస్తుందనే అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే 40 పైగా భాషల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది.
తొలిసారి నెట్ ఫ్లిక్స్ లో
కాగా, మొదటిసారి ఇలాంటి ఫీచర్ ను నెట్ ఫ్లిక్స్ పరిచయం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా వీక్షకులను ఆకట్టుకున్న కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ గేమ్ ను వీక్షకులకు అర్థమయ్యేలా సబ్ టైటిల్స్ ను అందించింది.
అదేవిధంగా స్థానిక భాషల్లో డబ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇపుడు యూట్యూబ్ సైతం మల్టీ లాంగ్వేజ్ వీడియోను నచ్చిన భాషలో చూసేందుకు యూజర్లకు అవకాశం కల్పించింది.