Xiaomi 15: షియోమీ తన అభిమానులకు శుభవార్త అందించింది. భారతదేశంలో రెండు స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. Xiaomi 15 Series భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఇవి Xiaomi 15, Xiaomi 15 Ultra పేరుతో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చా యి. వీటిలో Xiaomi 15 మొబైల్ కస్టమర్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Xiaomi 15 Series Highlights
షియోమీ 15 అల్ట్రాతో పాటు, అదే సిరీస్‌లో Xiaomi 15ని విడుదల చేసింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 50MP + 50MP + 32MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ మొబైల్‌లో 6.36 అంగుళాల డిస్‌ప్లే ఉంది. అలానే 5240mAh బ్యాటరీ, 90W వైర్డ్ హైపర్‌ఛార్జ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో సహా అనేక గొప్ప ఫీచర్లను కూడా ప్యాక్ చేస్తుంది.
Xiaomi 15 Price
షియోమీ 15 ఫోన్ సింగిల్ స్టోరేజ్ ఆప్షన్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999గా ఉంది. బ్లాక్, వైట్, గ్రీన్ కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మొబైల్‌ను Mi.com, Amazon , Xiaomi రిటైల్ స్టోర్లలో 19 మార్చి 5 PM నుండి ఏప్రిల్ 2 వరకు ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ చెల్లింపులపై కంపెనీ రూ. 5000 తక్షణ తగ్గింపును అందిస్తుంది. అలాగే రూ.5,999 విలువైన Xiaomi కేర్ ప్లాన్ ఇస్తున్నారు.
Xiaomi 15 Features And Specifications
షియోమీ 15 మొబైల్‌లో 6.36 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 2,670 × 1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనికి Xiaomi షీల్డ్ గ్లాస్ ప్రొటక్షన్ కూడా ఉంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో Xiaomi HyperOS 2తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 12GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది.
Xiaomi 15 Camera
షియోమీ 15 స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది హైపర్ OIS, LED ఫ్లాష్, లైకా సమ్మిలక్స్ లెన్స్‌తో వస్తుంది. అలానే 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ ఇన్ఫినిటీ లైకా టెలిఫోటో సెన్సార్‌ను కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
కొత్త షియోమీ 15 మొబైల్‌లో 5,240mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 90W వైర్డు ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, మాగ్నెటిక్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. ఫోన్‌లో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉన్నాయి. ఇందులో USB టైప్-సి ఆడియో, హై-రెస్ ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C ఉన్నాయి.