Redmi Note 14s: షియోమీ శక్తివంతమైన కెమెరాతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Redmi Note 14s పేరుతో తీసుకొచ్చింది. కంపెనీ దీనిని చెక్ రిపబ్లిక్, ఉక్రెయిన్‌లో ప్రారంభించింది. 4జీ కనెక్టివిటీతో వస్తున్న ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలానే శక్తివంతమైన మీడియాటెక్ Helio G99 అల్ట్రా ప్రాసెసర్‌ను అందించారు. ఇది మాత్రమే కాదు, ఫోన్‌లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫోన్ దుమ్ము, నీటి నుండి సురక్షితంగా ఉండటానికి IP64 రేటింగ్‌తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన పెద్ద బ్యాటరీ కూడా ఉంది. ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Redmi Note 14s Price
Redmi Note 14s ధర చెక్ రిపబ్లిక్‌లో PLN 5,999 (దాదాపు రూ. 22,700) ,ఉక్రెయిన్‌లో PLN 10,999 (దాదాపు రూ. 23,100)గా ఉంది. ఈ ఫోన్ అరోరా పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ వంటి కలర్ ఆప్షన్‌లలో రెండు దేశాలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Redmi Note 14s Features
ఫోన్ డ్యూయల్-సిమ్ (నానో+నానో) సపోర్ట్‌తో వస్తుంది. షియోమీ HyperOS స్కిన్‌తో ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Redmi Note 13 Pro 4G రీబ్యాడ్జ్ వెర్షన్ అని కంపెనీ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ Helio G99 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇదే చిప్‌సెట్ Redmi Note 13 Pro 4Gలో కూడా ఉంటుంది. ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది కాకుండా, వెనుక కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఫోన్‌లో అందుబాటులో ఉన్న కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, NFC, GPS ,USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం, ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ దుమ్ము, నీటి నుండి సురక్షితంగా ఉండటానికి IP64 రేటింగ్‌తో వస్తుంది. అలానే 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది.