Vivo T3 Ultra 5G: టెక్ మార్కెట్‌లో వివోకు విపరీతమైన డిమాండ్ ఉంది. కంపెనీకి చెందిన ‘T’ సిరీస్ ఫోన్లు భారీ సేల్స్ నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు రూ.3 వేల డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్, EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నుండి మీరు ఈ 5G ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ కొత్త ధర, ఫీచర్లను తెలుసుకుందాం.
సెప్టెంబర్‌లో Vivo T3 అల్ట్రా 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో సేల్‌కి వచ్చింది. ఈ ఫోన్ MediaTek Dimension ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే, 5,500mAh కెపాసిటీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వివో T3 Ultra 5G ప్రతి వేరియంట్‌పై రూ.3000 డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 19 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. HDFC, ICICI, SBI బ్యాంకుల నుండి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 3,000 అదనపు తగ్గింపు కూడా ఇస్తోంది. అలానే 3 నెలలు లేదా 6 నెలల నో కాస్ట్ EMIలో బుక్ చేయచ్చు. దీనితో పాటు రూ. 3,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మీరు ఈ మొబైల్‌ను Vivo eStore నుండి కొనచ్చు. ఫోన్ లూనార్ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.
Vivo T3 Ultra 5G Features
Vivo T3 అల్ట్రా 5G మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 3D AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2800 x 1260 పిక్సెల్ రిజల్యూషన్, గరిష్టంగా 4,500 నిట్‌ల బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ ఇస్తోంది. కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌తో మొబైల్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ Android 14 ఆధారిత Funtouch OS 14 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 12GB RAM+ 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
Vivo T3 అల్ట్రా 5G మొబైల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది OISతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాను కలిగి ఉంది. అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఫోన్‌లో అదనపు లైటింగ్, ఫెస్టివల్ పోర్ట్రెయిట్ మోడ్, AI ఎరేజర్, ఆరా లైట్ ఉన్నాయి.
Vivo T3 అల్ట్రా 5G మొబైల్ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB టైప్ సి ఆడియో, స్టీరియో స్పీకర్లు, 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్, GPS, USB టైప్-C 2.0 వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.