Vivo Y300 Plus 5G: వివో గొప్ప దసరా కానుకను అందించింది. కంపెనీ నిశ్శబ్ధంగా కొత్త ఫోన్‌ను ప్రారంభించింది. Vivo Y300 Plus పేరుతో మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ దీన్ని నేరుగా ఆఫ్‌లైన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ. 25,000. ఇందులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.
కంపెనీ Vivo Y300 Plus 5G ఫోన్‌ను రూ. 25,000కి విడుదల చేసింది. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ ఉంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కంపెనీ Vivo Y300 Plus 5G ఫోన్‌ను ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల చేసింది. ఇది 8GB RAM+128GB స్టోరేజీని కలిగి ఉంది. దీని ధర రూ.23,999. ఉంది మీరు ఈ కొత్త Vivo ఫోన్‌ని సిల్క్ బ్లాక్, సిల్క్ గ్రీన్ కలర్స్‌లో ఆర్డర్ చేయచ్చు. స్మార్ట్‌ఫోన్ ఈ రోజు సేల్‌కి రానుంది . మీరు రిటైల్ షాపులు, ైల్ షాపుల నుండి కొనచ్చు. స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేసే 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1300 నిట్‌ల బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.
కంపెనీ ఈ కొత్త Vivo ఫోన్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్. ఈ చిప్‌సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై తయారైంది. మొబైల్ 8GB RAM తో లాంచ్ అయింది. ఈ మొబైల్ 8GB ఎక్స్‌టెండ్ RAM టెక్నాలజీని కలిగి ఉంది. ఫోన్ 16GB ర్యామ్‌తో పాటు 8GB ఫిజికల్ ర్యామ్‌తో పనిచేస్తుంది. ఇది 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీనిని మెమరీ కార్డ్ ద్వారా 1 TB వరకు పెంచుకోవచ్చు.
Vivo Y300 Plus ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇది LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ బోకా లెన్స్ కెమెరా ఉంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 44W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ అందించారు. ది స్ప్లాష్ ప్రూఫ్ ఫోన్, IP54 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, Wi-Fi, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.