Site icon Prime9

108 MP Camera Smartphone Under 15K: బెస్ట్ కెమెరా ఫోన్లు.. 108 మెగాపిక్సెల్‌తో అల్లాడిస్తాయి.. చాలా చీప్‌గా కొనండి!

108 MP Camera Smartphone Under 15K

108 MP Camera Smartphone Under 15K

108 MP Camera Smartphone Under 15K: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దాదాపు ప్రతిరోజూ సరికొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇందులో బడ్జెట్ పాటు ప్రీమియం ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ సెగ్మెంట్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే చాలానే ఎంపికలు ఉన్నాయి. దీనిలో ప్రముఖంగా మూడు బ్రాండ్లు ఉన్నాయి. వీటని రూ.15 వేల కంటే తక్కువ ధరలో ఆర్డర్ చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

POCO X6 Neo 5G
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 12999, మీరు దీన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేయచ్చు. ఫోన్‌లో 6.67 అంగుళాల FHD + AMOLED డిస్‌ప్లే ఉంటుంది. డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌తో వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది MediaTek Dimensity 6080 6 nm ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఫోన్‌లో 8GB RAM + 28GB UFS 2.2 స్ోరేజ్‌ ఉంటుంది. అలానే 108MP 3X ఇన్-సెన్సర్ జూమ్ AI డ్యూయల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Redmi 13 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ డైమెన్సిటీ 6100+ 5G చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8 GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలానే ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫోన్ 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 8GB మోడల్‌ను అమెజాన్‌ నుంచి‌ రూ. 14999 ధరతో ఆర్డర్ చేయచ్చు.

Realme 11 5G
ఈ ఫోన్ 6.79 అంగుళాల అడాప్టివ్ సింక్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో వస్తుంది. ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్‌లో 8జీబీ ర్యామ్ ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో 3X ఇన్-సెన్సర్ జూమ్‌తో 108MP డ్యూయల్ కెమెరా ఉంది.
ఇది కాకుండా క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్, పోర్ట్రెయిట్, నైట్ మోడ్, హెచ్‌డిఆర్, 108 ఎంపి మోడ్, టైమ్-లాప్స్, గూగుల్ లెన్స్, మాక్రో వీడియో వంటి ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ డివైజ్ 8 జిబి మోడల్ ధర రూ.14,999.

Exit mobile version