Cheapest Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీ బడ్జెట్ రూ.10 వేలేనా? మరేం పర్లేదు! ఈ మధ్య కాలంలో బడ్జెట్ సెగ్మెంట్‌లో కూడా అద్భుతమైన ఫీచర్స్ అందించే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లు బేలెడు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌తో అద్భుతమైన కెమెరా క్వాలిటీ అందించే అటువంటి 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకుందాం.
Mototola g05
మోటరోలా గతేడాది డిసెంబర్‌లో Motorola G05 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఫోన్ మీడియాటెక్ Helio G81 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. గొరిల్లా గ్లాస్ 3తో 6.67-అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. అలానే IP54-రేటింగ్ ఉంది. అంటే ఇది నీటి స్ప్లాష్‌లను సులభంగా తట్టుకోగలదు.
ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, వెనుకవైపు ఫాక్స్ లెదర్ ఫినిషింగ్ ఉంది, ఇది మంచి గ్రిప్ ఇస్తుంది. ఈ గ్రిప్ ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. మరో మంచి విషయం ఏమిటంటే ఇందులో 18W వద్ద ఛార్జ్ అయ్యే 5,200mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ధర రూ.6,999 మాత్రమే.
Realme C61
ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc టైగర్ T612 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. 32MP కెమెరా కూడా ఉంది. పవర్ బటన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000mAh బ్యాటరీ ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 7,699.
Redmi A4
ఇది రెడ్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. HD+ రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల 120Hz IPS LCD డిస్‌ప్లే ఉంది. అలానే 50MP వెనుక కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, పవర్ బటన్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా HyperOSలో రన్ అవుతుంది. ఫోన్ ధర రూ. 8,499.
Poco M6
ఈ 5జీ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రోటక్షన్‌తో 6.74-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంటుంది. అలానే 50 MP వెనుక కెమెరా, ముందు భాగంలో మీరు 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14పై రన్ అవుతుంది. మీడియాటెక్ 6100+ చిప్‌సెట్‌లో రన్ అవుతుంది. 4GB RAM + 64GB , 5,000mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. దీని ధర రూ 8,499 నుండి ప్రారంభమవుతుంది.
Samsung Galaxy F06
ఈ ఎఫ్ సరీస్ సామ్‌సంగ్ 5జీ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. 6.7-అంగుళాల HD+ PLS LCD డిస్‌ప్లే, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలానే 2MP డెప్త్ షూటర్‌తో పాటు 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది Android 15 ఆధారంగా One UI 7.0 పై రన్ అవుతుంది. అంతేకాకుండా 25W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.