Site icon Prime9

Tecno Pova Neo 5G: టెక్నో బ్రాండ్ సంస్థ వారు విడుదల చెయ్యబోయే స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే!

tech smart phone prime9news

tech smart phone prime9news

Tecno Pova Neo 5G launch date: టెక్నో బ్రాండ్ సంస్థ వారు మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయనున్నారు. టెక్నో పోవా నియో 5జీ గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నారు.సెప్టెంబర్ 23న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారని టెక్నో సంస్థ వారు వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు టెక్నో పోవా నియో 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అంతకు ముందు పోవా నియో లైనప్‌లో 4జీ మోడల్ ఉండగా, ఇప్పుడు 5జీ ఫోన్‌ను మన ముందుకు తీసుకురానున్నారు. టెక్నో పోవా నియో 5జీ స్పెసిఫికేషన్లు, ధరలు వివరాలు ఇవే.

టెక్నో పోవా నియో 5జీ ఫోన్ 6.9 ఇంచుల ఫుల్ HD+AMOLED Display తో ఈ మొబైల్‌ వస్తుందని తెలిసిన సమాచారం. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ మనకి అందుబాటులో ఉండనుందని తెలిసిన సమాచారం. ఆండ్రాయిడ్‌ 12 బేస్ట్ HiOS UIతో రానుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్‌ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

Tecno Pova Neo 5G ధరలు వివరాలు..

మాకు తెలిసిన సమాచారం ప్రకారం టెక్నో పోవా నియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు ఈ విధంగా ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.17,000 నుంచి రూ.19,000 మధ్య ఈ స్మార్ట్ ఫోన్ ధర ఉండనుందని తెలుస్తోంది. షాఫైర్ బ్లాక్, స్ప్రింట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో మనకి అందుబాటులో ఉండనుంది.

Exit mobile version