SBI Server Down: పనిచేయని స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా సేవలు.. తీవ్ర అంతరాయం

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా సర్వర్లు సోమవారం డౌన్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

SBI Server Down: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా సర్వర్లు సోమవారం డౌన్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా బ్యాంకుల లావాదేవీల్లో కొంత అంతరాయం ఏర్పడింది. అయితే సోమవారం బ్యాంకుల సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. కానీ, ఇంటర్నెట్ ట్రాకర్ డౌన్ డిటెక్టర్ ప్రకారం సోమవారం ఉదయం 9.19 గంటల నుంచి ఎస్బీఐ సర్వర్లు పనిచేయలేదు. ముఖ్యంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, యోనో యాప్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్బీఐ కు చెందిన అన్నీ సేవలు ఆగిపోయాయని.. తాము చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లులు, ఇతర ఆన్ లైన్ సేవలు ఆలస్యం మయ్యాయని పలువురు ఖాతాదారులు ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

మార్చి 31 నుంచే డౌన్

అయితే, మరికొంతమంది కస్టమర్ల ఫిర్యాదు ప్రకారం బ్యాంకు సేవల్లో అంతరాయం మార్చి 31 నుంచే ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి బ్యాంక్ వెబ్ సైట్స్ , యాప్స్ పనిచేయడం లేదని పలువురు కస్టమర్లు తెలిపారు. ఇది బ్యాంకుల్లో సాధారంణంగా జరిగే సర్వర్ సమస్యలా? లేదా సైబర్ అటాకా? అంటూ పలువురు ట్వీట్స్ లో పేర్కొన్నారు.

వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించిన ఎస్బీఐ బ్యాంకు వార్షిక మూసివేత కార్యకలాపాల కారణంగా ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయని తెలిపింది. ‘మీ ఆందోళనను మేం అర్థం చేసుకున్నాం. వార్షిక ముగింపు కార్యకలాపాల తర్వాత యోనో / యోనో లైట్ / యోనో బిజినెస్ / యూపీఐ సేవలు సాయంత్రం 4.30 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు’ అని ఎస్బీఐ ఆదివారం ట్వీట్ చేసింది.

అంతరాయంపై ట్వీట్స్(SBI Server Down)

‘ఎస్బీఐ – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వర్లు డౌన్ అయ్యాయి’ అని మరో ట్విట్టర్ యూజర్ ఎస్బీఐ సర్వర్ అంతరాయంపై ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ సర్వర్లో తప్పేముందని ప్రశ్నించారు. వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు, యోనో పనిచేయడం లేదు ఇదేమిటి’ అని మరో కస్టమర్ ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సర్వర్ల అని think@TheOfficialSBI అనే ఎస్బీఐ కస్టమర్ ఒకరు తెలిపారు.