Samsung Galaxy Z Fold 6 Special Edition: సామ్‌సంగ్ ప్రకంపనలు.. సన్నని ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర తెలిస్తే షాక్ అవుతారు!

Samsung Galaxy Z Fold 6 Special Edition: టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు కొదువ లేదు. కుప్పలు కుప్పలుగా అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని బ్రాండ్లు ఉన్నప్పటికీ.. సామ్‌సంగ్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రేంజ్‌లో కావాలన్నా సామ్‌సంగ్‌లో దొరుకుతాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ సామ్‌సంగ్  గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ ఫోన్‌పై గత కొంతకాలంగా పనిచేస్తోంది.

తాజాగా దీనికి సంబంధించి కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా ఫోన్ త్వరలోనే విడుదల కానుంది. సెప్టెంబర్ 25న లాంచ్ కానుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అక్టోబర్ 21 న లాంచ్ అవుతుందని కంపెనీ టీజర్‌ను విడుదల చేసింది.

తాజా నివేదిక ప్రకారం Samsung Galaxy Z Fold 6 Special Edition ధర సుమారు $2200 అంటే రూ. 1,85,000 ఉండవచ్చు. దీని కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. లాంచ్‌కు ముందు దాని గురించి చాలా విషయాలు వెల్లడయ్యాయి. ముందుగా ఈ ఫోన్ చైనా మార్కెట్‌లోకి ానుంది. ఆ తర్వాత దక్షిణ కొరియాలో లాంచ్ చేస్తారు. గ్లోబల్ మార్కెట్‌లోకి ఎప్పుడొస్తుందనేది తెలియలేదు.

ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ 10 mm మందంతో కంపెనీ అత్యంత సన్నని ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. ఇది 6.5 అంగుళాల ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే, 8 అంగుళాల ఇంటర్నల్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు $2200 ధర ట్యాగ్‌తో బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉండచ్చు. కొత్త ఎడిషన్‌కి ‘స్లిమ్’ లేదా స్పెషల్ ఎడిషన్ అనే పేరుతో తీసుకురావచ్చు. ఫోన్ మెరుగైన డిజైన్, బలమైన పనితీరు, అద్భుతమైన కెమెరాను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. 4MP అండర్ డిస్‌ప్లే కెమెరాను ఇందులో చూడచ్చు.

సామ్‌సంగ్ ఈ స్మార్ట్‌ఫోన్ భభారతదేశంలో విడుదల గురించి ఎటువంటి సమాచారం లేనప్పటికీ సామ్‌సంగ్ గ్లోబల్ మార్కెట్‌లో కూడా ఈ పరికరాన్ని విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. చూస్తుంటే యాపిల్ లాంచ్ అయ్యాక మళ్లీ సామ్‌‌సంగ్ కొత్త ఎడిషన్‌తో ప్రకంపనలు సృష్టించబోతోంది.