Samsung Galaxy S25 Ultra Offers: సామ్‌సంగ్ మొబైల్ లవర్స్‌కు శుభవార్త చెప్పింది. భారతదేశంలో ఇటీవల విడుదల చేసిన ఫోన్‌ను బాంబాట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. మొబైల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘Samsung Galaxy S25 Series’ ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులో ఉంది. వీటిలో Samsung Galaxy S25 Ultra ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 25, ఎస్ 25 అల్ట్రా, ఎస్ 25 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా శక్తివంతమైన ఫోన్. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.86-అంగుళాల డిస్ప్లే కూడా అందుబాటులో ఉంది. 12GB RAM + 1TB స్టోరేజ్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Samsung Galaxy S25 Ultra Price
12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 1,29,999.
12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 1,41,999.
12GB RAM + 1TB స్టోరేజ్ ధర రూ. 1,65,999
సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కంపెనీ బలమైన ఆఫర్‌ను ఇచ్చింది. మీరు HDFC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే పూర్తి చెల్లింపుపై 8,000, EMIపై రూ.7,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఫోన్ డబుల్ స్టోరేజ్ వేరియంట్‌లో ఉంది. 512 GB , 256 GB.ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.9,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.
Samsung Galaxy S25 Ultra Features
సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మొబైల్‌లో 6.9-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఉంది. డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 గ్లాస్ ప్రొటక్షన్ ఉంది.
ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా సామ్‌సంగ్ One UI 7 OS పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 12GB RAM ఉంది. అలానే 1TB స్టోరేజ్‌తో పాటు 256GB, 512GB తో వస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియులకు బెస్ట్ ఆప్షన్. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 10-మెగాపిక్సెల్ లెన్స్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అలానే ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీరు కేవలం 30 నిమిషాల్లో 65శాతం వరకు ఛార్జ్ చేయచ్చు.