Samsung Galaxy A56 5G: టెక్ దిగ్గజం శాంసంగ్ తన A సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26 మొబైల్స్ ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్స్‌లో అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా అందించింది. ఈ ఫోన్లను ఎక్కువ వినియోగించేలా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ లభిస్తాయి. అయితే ఇప్పుడు ఈ A సిరీస్‌లోని ‘Samsung Galaxy A56 5G Smartphone’ గురించి అందుబాటులో ఉన్న ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
Samsung galaxy A56 5G Specifications
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిస్‌ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటక్షన్ అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 4nm ఎక్సినోస్ 1580 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. గ్రాఫిక్స్ కోసం AMD Xclipse 540 GPU చిప్‌సెట్‌ను ఇచ్చారు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7లో రన్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచచర్‌లను ఫోన్‌లో చూడొచ్చు.
ఈ శామ్‌సంగ్ ఫోన్‌కు కంపెనీ ఆరు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఛార్జర్‌తో పనిచేస్తోంది.భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్‌లో ఉంది. కెమెరా విషయానికి వస్తే, వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 12MP, 5MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై, 4జీ LTE, 5జీ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, 3.5మిమీ ఆడియో జాక్, యూఎస్‌బి-సి ఛార్జింగ్ ఉన్నాయి. వీటితో పాటుగా యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్, కాంపాస్ ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఉన్నాయి, డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP67 రేటింగ్ ఇచ్చారు. ఈ కారణంగా 30 నిమిషాల వరకు ఒక మీటర్ నీటిలో ఉన్నా డ్యామేజీ కాదని కంపెనీ చెబుతుంది.
Samsung galaxy A56 5G Price
శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ +256GB స్టోరేజ్. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.44 వేలుగా ఉండే అవకాశం ఉంది. ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైట్ గ్రే, ఆసమ్ గ్రాఫైట్ ఓలివ్ రంగుల్లో ఫోన్‌పను ఆర్డర్ చేయచ్చు.