Prime9

Samsung Galaxy S25 FE: ఫ్యాన్స్ స్పెషల్.. సామ్‌సంగ్ నుంచి సరికొత్త ఫోన్.. అప్‌గ్రేడ్లు చూస్తే అవాక్కే..!

Samsung Galaxy S25 FE: సాంసంగ్ మొబైల్ ప్రియులంతా అత్యంత ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 FE కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో లాంచ్ కావచ్చు. S25 FE గెలాక్సీ సరీస్‌లో మార్కెట్లోకి వస్తున్న వినూత్న మోడల్. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫ్యాన్ ఎడిషన్ మోడల్ సెల్ఫీ కెమెరాలో అప్‌గ్రేడ్‌ను చూడచ్చు. ఈ ఫోన్‌ను 10మెగాపిక్సెల్‌కి బదులుగా 12మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో లాంచ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

 

దక్షిణ కొరియా కంపెనీ తన మొదటి FE మోడల్ గెలాక్సీ S20 FEని 2020లో విడుదల చేసింది. దాని తదుపరి మోడల్ అంటే Galaxy S21 FEలో, కంపెనీ 32MP సెల్ఫీ కెమెరాను అందించింది. అయితే, తరువాత కంపెనీ 10MP కెమెరాతో గెలాక్సీ S22 FEని పరిచయం చేసింది. దీని తరువాత, ప్రారంభించిన అన్ని మోడళ్లలో, కంపెనీ 10MP సెల్ఫీ కెమెరాను మాత్రమే అందించింది. అటువంటి పరిస్థితిలో, మరోసారి సామ్‌సంగ్ ఫ్యాన్ ఎడిషన్ సెల్ఫీ కెమెరాలో అప్‌గ్రేడ్ పొందే అవకాశం ఉంది.

 

ఈ సంవత్సరం సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మోడళ్లను విడుదల చేసింది. ఈ సామ్‌సంగ్ ఫోన్లు గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ 25 అల్ట్రా, గెలాక్సీ S25 ఎడ్జ్ పేర్లతో వచ్చాయి. సామ్‌సంగ్ ఈ సంవత్సరం మొదటిసారిగా గెలాక్సీ S25 ఎడ్జ్‌ని విడుదల చేసింది. ఈ ఫోన్ వచ్చే ఏడాది నుండి ప్లస్ మోడల్‌ను భర్తీ చేయనుంది. అదే సమయంలో, ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే సామ్‌సంగ్ గెలాక్సీ S25 FEలో శక్తివంతమైన ఫీచర్లను చూడచ్చు.

 

ఈ సామ్‌సంగ్ ఫోన్‌ను క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ లేదా ఎక్సినోస్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఎక్సినోస్ 2400 ఇతో లాంచ్ చేయవచ్చు. ఇది గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ/512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో రావచ్చు, ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది.

 

ఇది శక్తివంతమైన 4,900mAh బ్యాటరీతో 45W వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను పొందచ్చు. సామ్‌సంగ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో లాంచ్ చేయవచ్చు. దీనిని $649.99 అంటే దాదాపు రూ. 55,000 ధరకు ప్రవేశపెట్టవచ్చు.

Exit mobile version
Skip to toolbar