Site icon Prime9

Samsung Galaxy S23 5G Price Drop: పడిపడి కొంటున్న జనాలు.. ఖరీదైన సామ్‌సంగ్ ఫోన్ సగం ధరకే.. డిస్కౌంట్లు చూస్తే..!

Samsung Galaxy S23 5G Price Drop

Samsung Galaxy S23 5G Price Drop

Samsung Galaxy S23 5G Price Drop: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మంచి,పనితీరు గల స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనడం చాలా కష్టమైన పని. మీరు మీ కోసం ప్రీమియం,స్టైలిష్‌గా కనిపించే ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఉపయోగకరమైన వార్త ఉంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం “Samsung Galaxy S23 5G” నుండి వచ్చిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. దీని ధర దాదాపు లక్ష రూపాయలు అయినప్పటికీ, ఇప్పుడు మీరు దాదాపు సగం ధరకు కొనుగోలు చేయచ్చు.

 

డిస్‌ప్లే నుండి ప్రాసెసర్, కెమెరా వరకు, ప్రతిదీ Samsung Galaxy S23 5Gలో అత్యున్నత స్థాయిలో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీరు బలమైన పనితీరును పొందబోతున్నారు. కాబట్టి మీరు మల్టీ టాస్కింగ్ లేదా గేమింగ్ వంటి ఏదైనా భారీ టాస్కింగ్ చేస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ మీకు ఎటువంటి సమస్య లేకుండా లాగ్ ఫ్రీ పనితీరును అందిస్తుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ దాని ధరలో పెద్ద కోత పెట్టింది, ఆ తర్వాత దీనిని చౌకగా కొనుగోలు చేయవచ్చు.

 

Samsung Galaxy S23 5G Offers
సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.89,999కి జాబితా చేశారు. అయితే, మీరు దీన్ని ఇప్పుడే కొనుగోలు చేసి పూర్తి 50శాతం తగ్గింపుతో ఇంటికి తీసుకెళ్లచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో మీరు దీన్ని కేవలం రూ.44,999కే కొనుగోలు చేయచ్చు. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే, మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

 

దీని ద్వారా మీరు అదనపు పొదుపు చేసుకోవచ్చు. మొబైల్ 128GB వేరియంట్‌పై కంపెనీ 50శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G పై ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దానిని రూ.41,050 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.

 

Samsung Galaxy S23 5G Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌‌తో ఉంటుంది. ఈ ఫోన్‌కు IP68 రేటింగ్ లభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే రక్షణ కోసం, దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అందించారు. అసలు విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 పై రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ అందించారు. 8జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50+10+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలానే పవర్ కోసం 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 3900mah బ్యాటరీ అందించారు.

Exit mobile version
Skip to toolbar