Redmi A4 5G Offers: రెడ్‌మి కంపెనీ 2024లో లాంచ్ చేసిన చౌకైన ఫోన్ ధరను తగ్గించింది. 8,500 రూపాయలకే అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. కంపెనీ Redmi A4 5G ఫోన్ కొనుగోలుపై ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం 25 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో తన అభిమానులకు వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చేసింది రెడ్‌మి. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.
Redmi A4 5G Discounts
Redmi A4 5G మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 9,499కి లాంచ్ చేశారు. ప్రస్తుతం డిస్కౌంట్‌తో కేవలం రూ.8,299కే విక్రయిస్తున్నారు. అంటే దాని అసలు ధర నుండి 25శాతం డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ మొబైల్ స్పార్కిల్ పర్పుల్, స్టార్రీ బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Redmi A4 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.88-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1640 X 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
గ్రాఫిక్స్ కోసం ఇది అడ్రినో GPU ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 4GB RAM+ 4GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌లో 64GB +128GB స్టోరేజ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీనిలో LED ఫ్లాష్, సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్ 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 33W అడాప్టర్ అందించారు. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ మొబైల్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 5, బ్లూటూత్ 5, GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో పోర్ట్ ఉన్నాయి.