Realme P1 speed 5G: చైనీస్ టెక్ బ్రాండ్ రియల్‌మీ భారతీయ టెక్ మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీని విడుదల చేయనుంది. ఫోన్ లాంచ్ డేట్‌ను కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ అక్టోబర్ 15న సేల్‌కి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రియల్‌మీ ఇప్పటికే దాని P-సిరీస్‌లో P1, P1 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను చేర్చింది. ఇప్పుడు మూడో గ్యాడ్జెట్ MediaTek ప్రాసెసర్‌తో P1 Speed దానిలో భాగం కానుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7300 ఎనర్జీ 5G ప్రాసెసర్ అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్‌లో 750,000 పాయింట్లను స్కోర్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
కొత్త Realme P1 స్పీడ్ 5G అక్టోబర్ 15 మార్కెట్‌లో సందడి చేయనుంది. ఈ సెగ్మెంట్‌లో వినియోగదారులు ఉత్తమ గేమింగ్, మల్టీ-టాస్కింగ్ పర్ఫామెన్స్ పొందుతారని కంపెనీ వెల్లడించింది. గేమింగ్, స్ట్రీమింగ్ లేదా మల్టీ-టాస్కింగ్ ఏదైనా భంలో Realme P1 స్పీడ్ 5G వినియోగదారులకు సరిపోతుంది.
థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం Realme P1 స్పీడ్ 5G 6,050mm చదరపు స్టెయిన్‌లెస్ స్టీల్ VC కూలింగ్ ఏరియాను కలిగి ఉంటుంది. ఇది 50-మెగాపిక్సెల్ AI కెమెరా యూనిట్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు దృవీకరించింది. ఇది డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది.
రియల్‌మీ లాంచ్ చేసిన కొత్త టీజర్ ప్రకారం ఫోన్ బ్లూ కలర్ వేరియంట్‌లో వస్తుంది. దాని వెనుక ప్యానెల్‌లో సర్కిల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది కాకుండా మొబైల్‌లో పెద్ద AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన తర్వాత కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రావచ్చు.