Site icon Prime9

Poco M7 5G: ఇలా ఎలా చేస్తారు భయ్యా.. రూ.9,999లకే ఖతర్నాక్ ఫీచర్స్.. రేపే పోకో M7 5జీ ఫస్ట్ సేల్..!

Poco M7 5G

Poco M7 5G

Poco M7 5G: పోకో ఇటీవల కొత్త 5G ఫోన్‌ను విడుదల చేసింది. దీన్ని బడ్జెట్ విభాగంలో ప్రవేశపెట్టారు. ఈ స్మార్ట్‌ఫోన్ ‘POCO M7 5G’ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఇది తన స్టైలిష్ లుక్స్, ఫీచర్లతో మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఈ మొబైల్ దాని మొదటి సేల్ రేపు అంటే మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ధర, ఆఫర్స్, ఫీచర్స్ తెలుసుకుందాం.

Poco M7 5G Price
Poco M7 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర కేవలం రూ.9,999. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,999కి లాంచ్ అవుతుంది. మొదటి రోజు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్‌లకు ప్రత్యేక బహుమతి లభిస్తుంది. ఈ ఫోన్‌ను మూడు కలర్ ఆప్షన్లలో విక్రయించనుంది. కస్టమర్లు దీనిని శాటిన్ బ్లాక్, మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ కలర్స్‌లో కొనుగోలు చేయచ్చు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ మొబైల్ మార్చి 7న సేల్‌కి వస్తుంది.

Poco M7 5G Features
Poco M7 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.88-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1,640 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ , 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ Poco ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షియోమీ హైపర్ ఓఎస్‌తో పనిచేస్తుంది.

ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ Poco 5G మొబైల్ 6GB RAM + 128GB,8GB RAM + 128GB స్టోరేజ్ ఎంపికలలో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 8GB వరకు వర్చువల్ ర్యామ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

Poco M7 5G మొబైల్‌లో 5160mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 33W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఈ మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar