Poco M7 5G Airtel Edition: Poco తన కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. నిశ్శబ్దంగా చౌక ధరలో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ గత వారం భారతదేశంలో POCO M7 5Gని ప్రారంభించింది. ఇది POCO M6 ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్. ముఖ్యంగా, POCO M7 Pro కంటే సరసమైన మొబైల్. ఇప్పుడు, కంపెనీ POCO M7 5G ఎయిర్‌టెల్ స్పెషల్ ఎడిషన్‌ని పరిచయం చేసింది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో మాత్రమే ఈ ఫోన్‌ను ఉపయోగించవచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.
Poco M7 5G Airtel Edition Price
Poco M7 5G ఎయిర్‌టెల్ ఎడిషన్ కేవలం రూ. 9,249 ధరతో ప్రారంభించారు. ఇందులో అన్ని ఆఫర్లు ఉన్నాయి. ఈ మొబైల్ మార్చి 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి వస్తుంది. ఇది మూడు రంగులలో వస్తుంది. మింట్ గ్రీన్, శాటిన్ బ్లాక్, ఓషన్ బ్లూ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. Poco M7 స్టాండర్డ్ ఎడిషన్ బేస్ వేరియంట్ రూ. 10,499 వద్ద విడుదలైంది. ఇప్పటికీ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 11,499.
Poco M7 5G Features And Specifications
Poco M7 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.88-అంగుళాల HD ప్లస్ డిస్ ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,640 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, హై-బ్రైట్‌నెస్ మోడ్‌తో 600 నిట్స్‌కు సపోర్ట్ చేస్తుంది. మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్‌లో రన్ అవుతుంది.
మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 33W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఈ మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.