Prime9

Poco F7: దిగితే అరాచకమే.. 7,550mAh బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. కింగ్ మేకర్ అవుతుంది..!

Poco F7: షియోమి సబ్-బ్రాండ్ పోకో జూన్ 6 శుక్రవారం తన కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్7ను ఈ నెల చివర్లో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సమాచారం భారతీయ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుండి వచ్చింది, ఇక్కడ ఈ ఫోన్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ కూడా క్రియేట్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ పేజీలో లాంచ్ తేదీని వెల్లడించనప్పటికీ, ఈ నెలలో ఫోన్ రావచ్చని URL సూచిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ప్రస్తుతం పెద్దగా తెలియదు కానీ అనేక లీక్‌లు, పుకార్లు ఇది 7,550mAh బ్యాటరీతో రావచ్చని సూచిస్తున్నాయి.

 

Poco F7 Features
పోకో F7‌లో క్వాల్కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ పొందుతుందని భావిస్తున్నారు, ఇది మిడ్-రేంజ్ విభాగంలో ఫ్లాగ్‌షిప్ లాంటి పనితీరును అందించే ప్రాసెసర్, ఇటీవల ఐకూ నియో 10 లో అందించారు. ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల ఫ్లాట్ LTPO అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది.

 

Poco F7 Camera Features
లీక్స్ ప్రకారం పోకో F7 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOS 2 పై రన్ కావచ్చు. ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండచ్చు. కెమెరా గురించి మాట్లాడుకుంటే ఎలిప్టికల్ కెమెరా మాడ్యూల్‌ ఉండచ్చు, ఇది Sony LYT-600 నుండి 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. ఇది పనితీరు-కేంద్రీకృత పరికరం కాబట్టి, ఇందులో టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం లేదు.

 

Poco F7 Battery
ఈ ఫోన్‌లో 16GB వరకు ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. దీనిలో 7,550mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అయితే, దీనిలో వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఉండే అవకాశం లేదు.

 

Poco F7 Price
ఈ ఫోన్ భారతదేశానికి బ్లాక్, వైట్, గ్రీన్ కలర్స్‌లో రావచ్చు. దాని మునుపటి మోడల్ లాగానే, Poco F7 ధర రూ. 30,000 నుండి రూ. 35,000 మధ్య ఉంటుందని అంచనా, పూర్తి వివరాలు లాంచ్ సమయంలో వెల్లడికానున్నాయి.

Exit mobile version
Skip to toolbar