OnePlus Nord: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మరో వెర్షన్ తో భారత్ మార్కెట్ లోకి రాబోతుంది. ఇప్పటిదే దేశియంగా వన్ ప్లస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వెర్షన్ రాబోతోంది.
ఏయే ఫీచర్లు ఉండొచ్చంటే? (OnePlus Nord)
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మరో వెర్షన్ తో భారత్ మార్కెట్ లోకి రాబోతుంది. ఇప్పటిదే దేశియంగా వన్ ప్లస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వెర్షన్ రాబోతోంది. దీంతో పాటు.. వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 కూడా లాంచ్ కానుంది.
ఈ ఏడాది ప్రారంభంలో ప్రీమియం వన్ ప్లస్ 11, వన్ ప్లస్ 11Rలను దేశంలో లాంచ్ చేసిన తర్వాత ఈ కొత్త ఫోన్ రాబోతోంది.
గత వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ మాదిరిగానే.. కొత్త నార్డ్ CE 3 లైట్ యూజర్ల కోసం తక్కువ బడ్జెట్‌తో రూపొందించింది.
గత ఏడాదిలో వన్ ప్లస్ నార్డ్
వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G ఫోన్ బేస్ 6GB RAM, 128GB స్టోరేజీ ధర రూ.19,999కు లాంచ్ అయింది. ఈ ఏడాదిలో నార్డ్ CE 3 లైట్ ధర దాదాపు అదే రేంజ్‌లో ఉండవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైమ్ కలర్ ఆప్షన్, ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. రౌండ్ రియర్ కెమెరా మాడ్యూల్‌లతో రానుంది.
ఈ ఫోన్‌కి సంబంధించిన ఇతర అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
మార్కెట్లో ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫీచర్లలో క్వాలమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ఉండే అవకాశం ఉంది.
అదే చిప్‌సెట్ iQOO Z6, Moto G62, Vivo T1 వంటి మిడ్-బడ్జెట్ ఫోన్‌ల మాదిరిగా ఉండనుంది.
నార్డ్ CE 3 గరిష్టంగా 8GB RAM, Android 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రావచ్చని సూచిస్తుంది.
వన్ ప్లస్ 6GB/4GB ర్యామ్‌తో వేరియంట్‌ను కూడా రావొచ్చు. ఇక ఇది హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌ని అందించే 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందించగలదు.
దీని ముందున్న వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్, చిన్న 6.59-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 120Hzకి సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు.
వన్‌ప్లస్ LCD ప్యానెల్ లేదా AMOLED ప్యానెల్‌తో వస్తుందా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. రెండోది సాధారణంగా మెరుగైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
వెనుక కెమెరా సిస్టమ్ విషయానికి వస్తే.. 108-MP ప్రైమరీ కెమెరా ఉంటుందని సూచిస్తుంది. ట్విట్టర్‌లోని కొంతమంది లీక్‌స్టర్లు 64-MP సెన్సార్ కావచ్చునని అంచనా.
అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్‌ని యాడ్ చేస్తుందో లేదో చూడాలి. హుడ్ కింద, కొత్త OnePlus ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కంపెనీ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందించనుంది.