Site icon Prime9

OnePlus Diwali Offers: పండగ వన్‌ప్లస్‌దే.. ఫోన్‌పై రూ.7 వేల డిస్కౌంట్.. ఫ్రీగా మరెన్నో గ్యాడ్జెట్లు!

OnePlus Diwali Offers

OnePlus Diwali Offers

OnePlus Diwali Offers: దేశంలో పండుగ సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో కొత్త వస్తువులను కొనడానికి ప్రజలు ఇష్డపడతారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఉచిత బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు, మాగ్నెటిక్ కీబోర్డ్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 12 మొబైల్ వేరియంట్‌పై రూ.7000 వరకు తగ్గింపు ఇస్తోంది. ఇది కాకుండా ప్యాడ్‌పై రూ.2వేల వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ ఈ బంపర్ డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

OnePlus 12
16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.69,999. సేల్‌లో రూ.7 వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనచ్చు. లిమిటెడ్ దీపావళి ప్రత్యేక ఆఫర్‌లో,ఫోన్‌పై రూ. 2,000 కూపన్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫోన్‌తో పాటు కంపెనీ OnePlus Buds Pro 2ని కూడా ఉచితంగా అందిస్తోంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ వన్‌ప్లస్ ఫోన్ 120Hz సూపర్ బ్రైట్ ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో5400mAh బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

OnePlus Pad
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ప్యాడ్ రూ. 35,999 సేల్‌లో లభిస్తుంది. దీపావళి సేల్‌లో ప్యాడ్‌పై రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ప్యాట్‌తో కంపెనీ రూ. 9,999 విలువైన OnePlus మాగ్నెటిక్ కీబోర్డ్‌ను ఉచితంగా అందిస్తోంది. మీరు 12 నెలల ఆకర్షణీయమైన నో-కాస్ట్ EMIతో కూడా ఈ ప్యాడ్‌ని కొనచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ప్యాడ్‌లో 11.61 అంగుళాల LCD ప్యానెల్ పొందుతారు. ఈ డిస్‌ప్లే 144Hz వరకు రిఫ్రెష్ రేట్లను సపోర్ట్ చేస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ 500 నిట్‌లు. ఈ ప్యాడ్‌లో కంపెనీ డైమెన్షన్ 9000 చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌గా అందిస్తోంది. ప్యాడ్ మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్స్. ప్యాడ్‌లో అందించబడిన బ్యాటరీ 9510mAh, ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Exit mobile version