Site icon Prime9

OnePlus 13: కొత్త ఫోన్ మచ్చా.. వన్‌ప్లస్ నుంచి కార్రాక్ మొబైల్.. ఊహించిన ఫీచర్లు!

OnePlus 13

OnePlus 13

OnePlus 13: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ త్వరలో OnePlus 13ని లాంచ్ చేయనుంది. ఇది దాని ముందు వేరియంట్‌లో పోలిస్తే చాలా అప్‌గ్రేట్‌లతో రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డిజైన్, ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ముందుగా చైనా మార్కెట్‌లో విడుదల అవుతుదుంది. గ్లోబల్ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈసారి వన్‌ప్లస్‌ ప్రాసెసర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో క్వాల్‌కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగ్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి కానుంది. అక్టోబర్ 22న క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ సందర్భంగా దీన్నిఆవిష్కరించనున్నారు. ఇంతకుముందు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4‌తో వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు కంపెనీ Snapdragon 8 Eliteతో పెద్ద అప్‌గ్రేడ్‌లతో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

ఈ కొత్త చిప్ OnePlus 13ని వేగంగా సున్నితంగా, మరింత శక్తివంతంగా, ఫోన్‌తో భారీ మల్టీ టాస్కింగ్, గేమింగ్, అధిక పనితీరు టాస్క్‌లను చేసే వినియోగదారులకు పరిపూర్ణంగా ఉండేలా రూపొందించారు. OnePlus ఈ చిప్‌సెట్‌తో నడిచే ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా Xiaomi, Oppo వంటి బ్రాండ్‌లతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది.

OnePlus బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ వేగం పరంగా కూడా స్ట్రాంగ్‌గా ఉండబోతోంది. OnePlus 13 భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ముందు వన్‌ప్లస్ మోడళ్లలో ఉన్న 5,400mAh బ్యాటరీ కంటే చాలా మెరుగైనది. ఛార్జింగ్ పరంగా OnePlus 13 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. మీరు కేబుల్ లేదా వైర్‌లెస్ ఛార్జర్‌ని ఉపయోగిస్తున్నా, మీ ఫోన్‌ని ఉపయోగించడానికి మీరు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్‌తో పాటు కర్వ్డ్ గ్లాస్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ బెజన్ లెస్ డిజైన్ ఫోన్‌కు అందమైన, ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇది ప్రతి ఎడ్జ్ నుంచి చూడటానికి గ్రాండ్‌గా చేస్తుంది. OnePlus 13 సిరామిక్ బాడీని కలిగి ఉండవచ్చు.

Exit mobile version
Skip to toolbar