Site icon Prime9

Nothing Phone 2a: స్పెషల్ ఆఫర్.. నథింగ్ ఫోన్‌పై రూ.6 వేల డిస్కౌంట్..!

Nothing Phone 2a

Nothing Phone 2a

Nothing Phone 2a: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సరికొత్త ఫోన్‌లు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి మీ దగ్గర ప్రత్యేకమైన డిజైన్‌తో ఫోన్ ఉంటే అందరి దృష్టి దాని వైపు మళ్లుతుంది. అమెరికన్ టెక్ కంపెనీ నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడటానికి ఇదే కారణం. ఫోన్ల వెనుక ప్యానెల్‌లో LED లైట్లు, ట్రాన్స్‌పాంట్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్‌తో నథింగ్ ఫోన్ (2a)ని బుక్ చేయవచ్చు. దీని వివరాలపై ఓ లుక్కేయండి!

నథింగ్ ఫోన్ (2a) బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు దీనిని చాలా స్పెషల్‌గా చేస్తాయి. వెనుక ప్యానెల్‌లో LED లైట్లతో కూడిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లేదా క్లీన్ NothingOS సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఈ ఫోన్ తక్కువ ధరలో ప్రీమియం పీల్ ఇస్తుంది. ఇందులోని MediaTek ప్రాసెసర్ స్మూత్ పర్ఫామెన్స్ అందిస్తుంది. AI ఆధారిత ఫోటోగ్రఫీ అల్గోరిథంలు కూడా డ్యూయల్ ప్రైమరీ కెమెరాలో ఉంటాయి. ఆఫర్ల కారణంగా ఈ ఫోన్ మంచి విలువను అందిస్తోంది.

ఈ కామర్్ ప్లాట్‌ఫామ్‌లో జరుగుతున్న ఫెస్టివల్ సేల్‌లో నథింగ్ ఫోన్ (2a) 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 24,999. అయితే ఈ ఫోన్ రూ. 27,999 ధరతో లాంచ్ అయింది. అన్ని బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపుపై రూ. 2000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఖాతాదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే దాదాపు రూ. 3000 వరకు నేరుగా తగ్గింపు పొందుతున్నారు.

ఆఫర్ల తర్వాత ఫోన్ ధర దాదాపు రూ. 21,999 ఉంటుంది. ఇది లాంచ్ ధర కంటే రూ.6000 తక్కువ. అదే సమయంలో పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.14,400 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ తగ్గింపు విలువ పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone (2a)
నథింగ్ స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తోంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1300నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పెద్ద 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో 50MP+50MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది Android 14 ఆధారంగా NothingOS 2.5లో పనిచేస్తుంది.

Exit mobile version
Skip to toolbar