Site icon Prime9

Nothing Ear Stick: నథింగ్ ఇయర్‌బడ్స్‌ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే..

ear birds prime9news

ear birds prime9news

Nothing Ear (Stick): రెండో Tws ఇయర్‌ బడ్స్‌ను నథింగ్ లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ట్రాన్స్‌ప్రంట్ డిజైన్ కేస్‌తో నథింగ్ ఇయర్ స్టిక్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో తన మూడో ప్రొడక్టుగా ఈ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా ఈ ఇయర్ బడ్స్‌ డిజైన్ ప్రత్యేకంగా నిలవనుంది. స్పెసిఫికేషన్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ ఇయర్‌ బడ్స్ ఒకసారి చార్జ్ పెడితే 29 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. ఈ ఇయర్‌ బడ్స్‌ పూర్తి వివరాలు కింద చదివి తెలుసుకోండి.

నథింగ్ ఇయర్‌బడ్స్‌ సిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి..
నథింగ్ ఇయర్‌ స్టిక్స్ ఇయర్‌బడ్స్‌లో 12.6mm డైనమిక్ సౌండ్ డ్రైవర్స్ ఉంటాయి. వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ కోసం IP54 రేటింగ్‌తో ఈ ఇయర్ బడ్స్ వస్తున్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌ లో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఐతే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉండదు. అలాగే సిలికాన్ బడ్స్ కూడా దీనికి ఉండవు. కాల్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉండేలా హై-డెఫ్ మైక్స్‌ను ఇయర్ స్టిక్స్‌లో ఇస్తున్నట్టు నథింగ్ వెల్లడించింది.

నథింగ్ ఇయర్‌బడ్స్‌ ధర ఈ విధంగా ఉన్నాయి..
నథింగ్ ఇయర్‌ స్టిక్ ధర భారత్ లో రూ.8,499 గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఈ ఇయర్‌బడ్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది. రేపు పరిమిత సంఖ్యలో కొన్ని ఇయర్‌బడ్స్‌ సేల్‌కు వస్తాయి. ప్రస్తుతం వైట్ కలర్‌లోనే ఈ ఇయర్‌ బడ్స్ మనకి అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version