Moto E22s Smart Phone : మోటో E22s లాంచ్ వివరాలు
మోటో ఈ22ఎస్ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నారు.ఈ విషయాన్ని మోటో ట్విట్టర్ అకౌంటు ద్వారా అధికారికంగా మోటోరోలా వెల్లడించింది.ఈ స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మన ముందుకు అందుబాటులోకి వస్తుంది.అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్ కోసం ప్రత్యేక పేజీని మోటోరోలా ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ ఫోనుకు సంభందించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లను విడుదల చేసింది.
మోటో E22s స్పెసిఫికేషన్లు :
Moto E22s మొబైల్‌లో మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్ ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 ఇంచుల HD+ IPS LCD DISPLAY తో మన ముందుకు రానుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఈ ఫోన్‌లో ఇచ్చింది మోటోరోలా.Moto E22s వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంటుంది.Moto E22s ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ Depth కెమెరాలు ఉంటాయి.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మోటో 4జీ స్మార్ట్ ఫోన్ మన ముందుకు వస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర ఈ విధంగా ఉంది
మోటో E22s ధర యూరప్‌లో ఈ స్మార్ట్ ఫోన్ 159.99 యూరోలు అంటే మన కరెన్సీలో (సుమారు రూ.12,700)గా ఉంటుంది.మన ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10వేలలోపులోనే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.