Site icon Prime9

Jio Plans: జియోలో ఈ 10 ప్లాన్స్ జాడ కూడా కనిపించడం కూడా లేదు

jio prime9news

jio prime9news

Jio Plans: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో. జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్‌లను మన ముందుకు ఇస్తోంది. రకరకాల బెనిఫిట్స్‌తో డిఫరెంట్ ప్లాన్స్‌ను మన ముందుకు అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలోనే పాపులర్ OTT ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌ తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇలా తీసుకొచ్చింది. విభిన్నమైన వ్యాలిడిటీ, ధరలతో డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్లాన్స్ ఉండేవి. రిలయన్స్ జియో హఠాత్తుగా వాటిలో చాలా వాటిని నిలిపివేసింది.ఇలా చాలా ప్లాన్స్‌ను ఎత్తేసింది. యూజర్లకు ప్రస్తుతం ఆ ప్లాన్స్ అందుబాటులో లేవు. జియో తొలగించిన ఆ 10 ప్లాన్స్ ఇక్కడ తెలుసుకుందాం.

డిస్నీ+ హాట్‌స్టార్ కూడిన చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో అందించేది. ఐతే అందులో 10 ప్లాన్‌లను తీసేయగా, ప్రస్తుతం రెండు మాత్రమే ఈ బెనిఫిట్‌ను కలిగి ఉన్నాయి. మైజియో యాప్‌లో జియో తీసేసిన ప్లాన్స్ రూ.333, రూ.499, రూ.583, రూ.601, రూ.783, రూ.799, రూ.1,099. డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ అయిన రూ.151, రూ.555, రూ.659లను కూడా జియో తీసేసింది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్ లభించే ఈ ప్లాన్‌లన్నీ మాయమయ్యాయి. దీనితో ఇప్పుడు ఈ ప్లాన్‌లను ఎంచుకునేందుకు యూజర్లకు అవకాశం కూడా లేకుండా పోయింది. మరి వీటిని జియో శాశ్వతంగా తొలగించిందా, లేక మళ్లీ కొత్త బెనిఫిట్స్‌తో తీసుకొస్తుందా అనేది చూడాలి.

Exit mobile version