Site icon Prime9

Reliance Digital: రిలయన్స్ డిజిటల్ నుంచి 100GB ఉచిత డేటాతో HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌

jio 5g network free for some users

jio 5g network free for some users

Technology: రిలయన్స్ డిజిటల్ 100GB ఉచిత డేటాతో కొత్త హెచ్ పి స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌ను ప్రకటించింది. హెచ్ పి స్మార్ట్ సిమ్ లైఫ్ అనేది మొదటి రకమైన స్మార్ట్ LTE ల్యాప్‌టాప్ ఆఫర్. మీరు హెచ్ పి నుండి స్మార్ట్ LTE ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే, 100GB ఉచిత డేటాను పొందుతారు.

ఈ ఆఫర్‌ను పొందేందుకు వినియోగదారులకు జియో హెచ్ పి స్మార్ట్ సిమ్ అవసరం. ఎంపిక చేసిన హెచ్ పి ల్యాప్‌టాప్‌ల కొత్త కస్టమర్‌లకు 100GB ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. హెచ్ పి LTE ల్యాప్‌టాప్‌తో కొత్త జియో సిమ్ సబ్‌స్క్రయిబ్ చేసుకోవడంపై ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 365 రోజుల (రూ.1500 విలువ) 100 GB డేటాను పొందుతారు. ప్రస్తుతం, వినియోగదారులు కొనుగోలు చేయగల రెండు అర్హత గల మోడల్‌లు ఉన్నాయి. అవి HP 14ef1003tu మరియు HP 14ef1002tu

100 GB డేటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64 Kbps వరకు తగ్గించబడుతుంది. వినియోగదారులు అదనపు హై స్పీడ్ 4G డేటా కోసం మై జియో లేదా జియో. కామ్ నుండి అందుబాటులో ఉన్న డేటా ప్యాక్‌లు / ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.

Exit mobile version