Site icon Prime9

Jio New Recharge Plan: జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూపాయి తేడాతో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

Jio New Recharge Plan

Jio New Recharge Plan

Jio New Recharge Plan: రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఇప్పటికే అనేక ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తన హార్డ్‌కోర్ వినియోగదారుల కంఫర్ట్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లను తీసుకువస్తూనే ఉంది. జూలైలో జియో పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసినప్పటి నుండి అనేక కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు జియో తన రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను రిలీజ్ చేసింది. వీటిలో మీకు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీతో అన్‌లిమిడెడ్ 5G డేటా కూడా అందిస్తాయి. ఈ ప్లాన్‌లలో లభించే ఆఫర్‌ల గురించి వివరంగా తెలియజేస్తాము.

జియో రూ. 1028 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 1028 ప్లాన్ మీకు అనేక గొప్ప ఆఫర్లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీరు 84 రోజుల లాంగ్ వాలిడిటీని పొందుతారు. మీరు ఏ నెట్‌వర్క్‌లోనైనా 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ చేయవచ్చు. ప్లాన్‌లో మీకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎమ్ఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్లాన్‌లో మీకు మొత్తం 168GB డేటా లభిస్తుంది. అంటే మీరు ప్రతిరోజూ 2GB డేటాను ఉపయోగించవచ్చు.

జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్‌లు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా పొందుతారు. ప్లాన్ తీసుకున్న తర్వాత మీరు Swiggy One Lite ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఇది కాకుండా మీరు ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు.

జియో రూ. 1029 రీఛార్జ్ ప్లాన్
జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు దాదాపు రూ. 1028 ప్లాన్‌లకు సమానంగా ఉంటాయి. ఈ ప్లాన్‌లో ఉన్న పెద్ద తేడా ఏమిటంటే ఇందులోని కస్టమర్‌లకు OTT సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు. జియో రూ.1029 ప్లాన్‌లో వినియోగదారులకు 84 రోజుల వాలిడిటీని అందిస్తోంది. ఇందులో కూడా మీరు అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా పొందుతారు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది.

1 రూపాయల తేడాతో ఈ ప్లాన్‌లో మీరు 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు. ఇది కాకుండా ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కస్టమర్‌లకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

Exit mobile version