Site icon Prime9

Jio Budget Phones: జియో నుంచి అదిరిపోయే గిఫ్ట్.. రూ. 1,099లకే కొత్త ఫోన్లు.. ఫీచర్లు నెక్స్ట్ లెవల్!

Jio Budget Phones

Jio Budget Phones

Jio Budget Phones: రిలయన్స్ జియో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో తన జియో భారత్ సిరీస్‌లో JioBharat V3, V4 అనే రెండు కొత్త మోడల్‌లను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఫోన్‌ల ధర కేవలం రూ. 1,099 మాత్రమే. భారతదేశంలోని మిలియన్ల మంది 2G వినియోగదారులకు సరసమైన 4G కనెక్టివిటీని అందించడానికి వీటిని డిజైన్ చేశారు. జియో భారత్ V2 విజయం తర్వాత ఈ కొత్త మోడల్స్ తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జియో భారత్ V3 అనేది స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఫోన్. ఫీచర్ ఫోన్‌లో గొప్ప డిజైన్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ఇది పరిచయం చేశారు. ఇది కేవలం యుటిలిటీ ఫోన్ కంటే చాలా ఎక్కువ. జియో భారత్ V4 అనేది లేటెస్ట్ డిజైన్, హై క్వాలిటీని అందిస్తుంది. ఇది గొప్ప యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రెండు మోడల్‌లు సరసమైన ధర వద్ద ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి. తద్వారా వినియోగదారులు పనితీరు విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు.

రెండు ఫోన్‌లు జియో డిజిటల్ సర్వీస్‌కు సపోర్ట్ ఇస్తాయి. JioTV వినియోగదారులకు 455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ానె్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. కాబట్టి మీరు మీకు ఇష్టమైన షోలు, వార్తలు, క్రీడలను ఆస్వాదించవచ్చు. UPI ఇంటిగ్రేషన్, బిల్ట్ ఇన్ సౌండ్ బాక్స్‌తో, జియోప్లే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. జియో చాట్ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ మెసేజస్, ఫోటో షేరింగ్, గ్రూప్ చాట్ ఆప్షన్ అందిస్తుంది.

రెండు ఫీచర్లు ఫోన్లు 1000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తాయి. ఇది 24 గంటల్ బ్యాటరీ లైఫ్ ఇస్తోంది. స్టోరేజ్‌ను 128GB వరకు పెంచుకోవచ్చు. వినియోగదారులు ఫోన్‌లో వారి ఫోటోలు, వీడియోలు, యాప్‌ల కోసం పుష్కలంగా స్థలాన్ని కలిగి ఉంటారు. ఈ ఫోన్‌లు 23 ఇండియన్ లాంగ్వేజస్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇవి దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులకు ఉత్తమ ఫోన్‌లుగా మారాయి.

జియో ఫోన్‌లు రూ. 123 నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌తో వస్తాయి. ఇది అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, 14 GB డేటాను అందిస్తుంది. ఇది JioBharat మోడల్ బడ్జెట్‌ను ఫేవర్‌బుల్‌గా చేయడమే కాకుండా ఈ ధరతో అనేక ఫోన్‌లతో పోటీపడుతుంది. ఈ ఫోన్లు త్వరలో జియో మార్ట్, అమెజాన్‌లో సేల్‌కు రానున్నాయి.

Exit mobile version
Skip to toolbar